ప్రియమైన ప్రభు క్రీస్తు విశ్వాసులారా మరియు అద్భుతాల పునీత అంతోని వారి భక్తులారా , సందర్శకులారా !
ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ పునీత అంతోని వారి పుణ్యక్షేత్ర వెబ్సైట్ కు హృదయ పూర్వక స్వాగతమును పలుకుచున్నాను.
పేదలపట్ల ప్రేమ, ఆశ్రితుల పట్ల కరుణ, విశ్వాసుల పట్ల ఆదరణ , భక్తులకు పెన్నిధిగా భాసిల్లుతున్న పునీత అంతోని వారి నామమున వెలసిన ఈ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అశేష ప్రజలను ఆకర్షిస్తుంది.
పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా అనేక మంది భక్తులు విశ్వాసంలోకి వస్తున్నారు, దేవుని దీవెనలను పొందుతున్నారు, అద్భుతాలను చవిచూస్తున్నారు. ఈ పునీతుని సహాయాన్ని కోరుకుంటూ ప్రతిరోజు అనేమకమంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్నారు . తమ జీవితంలో కోల్పోయిన వాటిని ఈ పునీతుని మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా తిరిగి కనుగొంటున్నారు.
ఈ వెబ్సైట్ ను మీ ముందుకు తీసుకురావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దీని ద్వారా మన పుణ్యక్షేత్ర చరిత్ర ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పండుగలు, పూజాబలివేళలు, ప్రార్థనలు, భక్తి కార్యక్రమాలు వీడియొలు మరియు ఇతర ముఖ్యమైన & విలువైన సమాచారాన్ని మీకు అందించడము నాకు చాల ఆనందంగా ఉంది.
ప్రత్యక్షంగా పునీత అంతోని వారి పుణ్యక్షేత్రాన్ని సందర్శించలేని భక్తులు ఈ వెబ్సైట్ ద్వారా , మన ఆధ్యాత్మిక కుటుంబంతో అనుసంధానమై , ఇక్కడ జరిగే దివ్యబలిపూజలను , ప్రార్థనలను వీక్షిస్తూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
మన ప్రభువైన యేసు క్రీస్తు దీవెనలు పునీత అంతోనివారి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా లభించాలని ప్రార్థిస్తున్నాను.
పునీత అద్భుతాల అంతోని వారా !! మా కొరకు వేడుకోనండి !!
ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థిస్తూ... దేవుని పరిచర్యలో... మీ సేవలో ...
Msgr. అల్లం శౌరెడ్డి, Vicar General
పుణ్యక్షేత్ర రెక్టర్ & విచారణ గురువులు