ముందు జపము
మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వరా దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను పాత్రుడనుగాక యుండినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను, దేవమాతకు స్తోత్రముగాను ఏబదిమూడు పూసల జపము చేయుటకు మహా ఆశగా నున్నాను. ఈ జపము భక్తితో చేసి పరాకులేక ముగింప మీ సహాయము నియ్యనవధరించండి.
సక పుణ్యముకు విశ్వాసమనెడి పుణ్యములకు మూలమై యుండుట వలన ముందు ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొనుదుము గాక.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏక పుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవమీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవనాడు చనిపోయిన వారలలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని యున్నారు. అక్కడ నుండి జీవించువారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్.
1-పర. 3- మం. 1-త్రిత్వ
(ప్రతి దేవరహస్యం అనంతరం ఈ విన్నపమును చెప్పవలెను.)
ఫాతిమా మాత ప్రార్థన :
ఓ మా యేసువా మా పాపములను మన్నించండి. నిత్య నరకాగ్నినుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరక అపాయ స్థితిలో ఉన్న ఆత్మలను, మోక్షమునకు చేర్చండి.
సంతోష దేవరహస్యములు
(సోమ, శని & ఆగమనకాల ఆదివారములు)
గాబ్రియేలు సన్మనస్సుడు దేవమాతకు మంగళవార్త చెప్పుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
దేవమాత పునీత ఎలిజబేతమ్మను సంధించుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
జేసువు పుట్టుకను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
బాల జేసువు దేవాలయములో కానుకగా నర్పింపబడుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
దేవమాత కానకపోయిన బాలజేసును దేవాలయములో కనుగొనుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
వెలుగు దేవరహస్యములు
(గురువారములు)
యోర్థానులో యేసు బాప్తిస్మము పొందుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
కానాపల్లెలో మొదలైన యేసుని మహిమలు గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
ప్రభువు దైవరాజ్యమును ప్రకటించుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
ప్రభువు దివ్యరూపమును పొందుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
ప్రభువు దివ్యసత్ప్రసాదమును స్థాపించుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
దుఃఖ దేవరహస్యములు
(మంగళ, శుక్ర & తపఃకాల ఆదివారములు)
జేసు రక్తచెమట చెమర్చుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
జేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
జేసునాధుని తిరుశిరస్సున ముండ్ల కిరీటము పెట్టి కొట్టుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
జేసు సిలువను మోసుకొని పోవుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
జేసు సిలువమీద కొట్టబడి మరణము పొందుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
మహిమ దేవరహస్యములు
(బుధ మరియు సామాన్యకాల & పాస్కాకాల ఆదివారములు)
జేసు ఉత్తానమగుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
జేసు మోక్షారోహణ మగుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
పవిత్రాత్మయైన సర్వేశ్వరుడు అపోస్తలుల మీద వేంచేసి వచ్చుటను గురించి ధ్యానించుదము గాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమున కేత్తబడుటను గురించి ధ్యానించుదముగాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
దేవమాత పరలోక, భూలోక రాజ్ఞిగా స్థాపింపబడుటను గురించి ధ్యానించుదముగాక.
(1 పర. 10- మం. 1 - త్రిత్వ. 1 - ఫా.)
ప్రార్థన
అతి దూతయగు పునీత మిఖాయేలా దేవదూతయగు పునీత గాబ్రియేలా అపోస్తలైన పునీత రాయప్ప, అర్పప్ప, యోగప్ప అనెడు వారలారా, మే మెంత పాపాత్ములుగా నుండినను, మేము వేడుకొను ఈ యేబదిమూడు పూసల జపమును దేవమాత పాదములందు మీ స్తోత్రములతో నాకటిగాచేర్చి కానుకగా సమర్పించుడని మిమ్ము జూచి ప్రార్థించుచున్నాము. ఆమెన్.
కృపారసముగల జపము
కృపారసముగల మాతయై యుండెడు రాజ్ఞీ! వందనము మా జీవమా మా మధురమా, మా శరణమా! వందనము. పరదేశులమై యుండెడు మేము ఏవ యొక్క బిడ్డలము. మిమ్ము జూచి మొరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమయమందు ప్రలాపించి ఏడ్చుచు-మిమ్ము జూచి నిట్టూర్పు విడుచు చున్నాము. అందువలన మా కొరకు మనవి చేసెడి తల్లి! మీ దయారసముగల కన్నులను మావైపు తిప్ప నవధరించండి. ఇదిగాక ఈ పరదేశము గడచిన తరువాత - ఆశీర్వదింపబడిన మీ గర్భఫలమగు యేసు నాధుని ప్రత్యక్ష దర్శనమును మాకీయ నవధరించండి. కృపగలిగిన తల్లి, దయారసము గలిగిన తల్లి! ఓ మధురమైన కన్య మరియమ్మా! యేసు క్రీస్తునాధుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు - సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాతా! మాకొరకు ప్రార్థించండి.
ప్రార్థించుదము : సర్వశక్తిగల దేవా! ముక్తిపొందిన కన్యకయు, తల్లియునైన మరియమ్మగారి ఆత్మ శరీరములను పవిత్రాత్మ వాసమగునట్లు అమర్చితిరే. అటువంటి దేవమాతను తలంచి సంతోషించెడు మేము ఆమె యొక్క కనికరమైన వేడుదలచేత ఇప్పటి కీడుల నుండియు, నిత్య మరణము నుండియు తప్పింపబడునట్లు కృపచేయ నవధరించండి. మానాధుడైన యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవులను మాకు దయచేయండి. ఆమెన్.
దేవమాత ప్రార్థన
స్వామీ కృపగా నుండండి - స్వామీ కృపగా నుండండి.
క్రీస్తువా కృపగా నుండండి - క్రీస్తువా కృపగా నుండండి.
స్వామీ కృపగా నుండండి - స్వామీ కృపగా నుండండి.
క్రీస్తువా మా ప్రార్థన విని నవధరించండి.
క్రీస్తువా మా ప్రార్థన దయాకాళము దయచేయండి.
పరలోకములందుండు పితయైన సర్వేశ్వరా - మా మీద దయగానుండండి.
లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వరా మా కొరకు వేడుకొనండి.
పవిత్రాత్ముడైన సర్వేశ్వరా మా కొరకు వేడుకొనండి.
ఏక పరిశుద్ధ త్రిత్వమైన సర్వేశ్వరా మా కొరకు వేడుకొనండి.
పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి.
సర్వేశ్వరుని యొక్క మాతా మా కొరకు వేడుకొనండి.
కన్యకలయొక్క కన్యకా మా కొరకు వేడుకొనండి.
క్రీస్తునియొక్క మాతా మా కొరకు వేడుకొనండి.
దేవ ప్రసాదముయొక్క మాతా మా కొరకు వేడుకొనండి.
పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి.
సర్వేశ్వరుని యొక్క మాతా మా కొరకు వేడుకొనండి.
కన్యకలయొక్క కన్యకా మా కొరకు వేడుకొనండి.
క్రీస్తునియొక్క మాతా మా కొరకు వేడుకొనండి.
దేవ ప్రసాదముయొక్క మాతా మా కొరకు వేడుకొనండి.
మహా పరిశుద్ధ మాతా మా కొరకు వేడుకొనండి.
మహా విరక్తిగానుండెడు మాతా మా కొరకు వేడుకొనండి.
నిష్కళంకమైన మాతా మా కొరకు వేడుకొనండి.
కల్మషము లేని మాతా మా కొరకు వేడుకొనండి.
ప్రేమకు తగిన మాతా మా కొరకు వేడుకొనండి.
మహాస్తుతికి పాత్రురాలైన మాతా మా కొరకు వేడుకొనండి.
మంచి ఆలోచనయొక్క మాతా మా కొరకు వేడుకొనండి.
సృష్టికర్తయొక్క మాతా మా కొరకు వేడుకొనండి.
రక్షకుని మాతా మా కొరకు వేడుకొనండి.
మహా వివేకముగల కన్యకా మా కొరకు వేడుకొనండి.
మహా పూజ్యనైన కన్యకా మా కొరకు వేడుకొనండి.
స్తుతియంత యోగ్యురాలైన కన్యకా మా కొరకు వేడుకొనండి.
శక్తిగల కన్యకా మా కొరకు వేడుకొనండి.
దయగల కన్యకా మా కొరకు వేడుకొనండి.
విశ్వాసముగల కన్యకా మా కొరకు వేడుకొనండి.
ధర్మములయొక్క అద్దమా మా కొరకు వేడుకొనండి.
జ్ఞానముయొక్క ఆలయమా మా కొరకు వేడుకొనండి.
మా సంతోషముయొక్క కారణమా మా కొరకు వేడుకొనండి.
జ్ఞానపాత్రమా మా కొరకు వేడుకొనండి.
సహనము తగిన పాత్రమా మా కొరకు వేడుకొనండి.
అత్యంత భక్తియొక్క పాత్రమా మా కొరకు వేడుకొనండి.
దేవరహస్యములగల రోజా పుష్పమా మా కొరకు వేడుకొనండి.
దావీదుయొక్క గోపురమా మా కొరకు వేడుకొనండి.
దంతముయొక్క గోపురమా మా కొరకు వేడుకొనండి.
స్వర్ణమయమైన ఆలయమా మా కొరకు వేడుకొనండి.
వాగ్దానముయొక్క మందసమా మా కొరకు వేడుకొనండి.
మోక్షముయొక్క వాకిలి మా కొరకు వేడుకొనండి.
ఉదయకాల నక్షత్రమా మా కొరకు వేడుకొనండి.
వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా మా కొరకు వేడుకొనండి.
పాపాత్ములకు శరణమా మా కొరకు వేడుకొనండి.
కష్టపడువారలకు ఆదరమా మా కొరకు వేడుకొనండి.
క్రీస్తుభక్తులయొక్క సహాయమా మా కొరకు వేడుకొనండి.
సర్వసూర్యులయొక్క రాజ్ఞీ మా కొరకు వేడుకొనండి.
సింహాసనములయొక్క రాజ్ఞీ మా కొరకు వేడుకొనండి.
పితరులయొక్క రాజ్ఞీ మా కొరకు వేడుకొనండి.
ఆరోప్యులయొక్క రాజ్ఞీ మా కొరకు వేడుకొనండి.
వేదసాక్షులయొక్క రాజ్ఞీ మా కొరకు వేడుకొనండి.
స్తోత్రములయొక్క రాజ్ఞీ మా కొరకు వేడుకొనండి.
కన్యకలయొక్క రాజ్ఞీ మా కొరకు వేడుకొనండి.
సకల పునీతులయొక్క రాజ్ఞీ మా కొరకు వేడుకొనండి.
జన్మపాపము లేక ఉద్భవించిన రాజ్ఞీ మా కొరకు వేడుకొనండి.
మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞీ మా కొరకు వేడుకొనండి.
పరిశుద్ధ జపమాల రాజ్ఞీ మా కొరకు వేడుకొనండి.
కుటుంబములయొక్క రాజ్ఞీ మా కొరకు వేడుకొనండి.
సమాధానము యొక్క రాజ్ఞీ మా కొరకు వేడుకొనండి.
లోకముయొక్క పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లయైన జేసువా - మా పాపములను మన్నించండి స్వామీ.
లోకము యొక్క ... మా ప్రార్థన విచారణ దయచేయండి స్వామీ. లోకము యొక్క ... మా మీద దయగా నుండండి స్వామీ.
ఒ : జేసునాధుని వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు
అం.: సర్వేశ్వరుని పరిశుద్ధ మాతా, మా కొరకు వేడుకొనండి.
ప్రార్థించుదము : - జగద్రక్షకుడైన జేసువా మీ సిలువ క్రింద నిలిచియుండిన మీ దివ్యమాతను మీ ప్రియశిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి యనుగ్రహమును దయచేసి దేవరవారు కాలప్రమాణ మందు నిజమైన మనుష్యుడై జన్మించ తెలిసికొని నటువంటి మాతయొక్క బిడ్డలుగా నుండెడు భాగ్యము మా కెప్పటికిని ప్రాప్తింపచేయు నవధరించండి స్వామీ. ఆమెన్.
మిక్కిలి నెనరుగల తల్లి! మీ శరణుకు పరుగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒకరైనను మీవలన చేయి విడువబడినట్లు ఎన్నడును లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞీ! దయారసముగల తల్లి! ఇటువంటి నమ్మికచేత ప్రేరేపింపబడి, మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చియున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి యేడ్చెడు పాపినైన నేను, మీ దయాళత్వమునకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతార మెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి! నా విజ్ఞాపనమును త్యజింపక దయాపరులై విననవధరించండి ఆమెన్.
జన్మపాపము లేక ఉద్భవించిన పవిత్ర మరియమ్మా పాపులకు శరణమా ఇదిగో పరుగెత్తివచ్చి మీ శరణుజొచ్చితిమి. మా మీద నెనరుగా నుండి, మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి.
(ఇట్లు మూడు సార్లు చెప్పి 1 పర. మం. త్రిత్వ.)
నా యొక్క రాజ్ఞీ నా యొక్క తల్లి నన్ను మీకు సంపూర్ణముగా సమర్పించుచున్నాను. నా యొక్క భక్తి మీకు చూపించుటకు ఈ దినము నా కండ్లను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించు చున్నాను. కాబట్టి నన్ను మీ స్వంతముగా చేసికొని నన్ను కాపాడ నవధరించండి. ఆమెన్.