పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పూజింపబడునుగాక! నీ రాజ్యము వచ్చునుగాక! నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు, భూలోకమందును నెరవేరునుగాక! నానాటికి కావలసిన మా అన్నము, మాకు నేటికి అనుగ్రహింపుము. మాయొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించునట్లు, మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడులోనుండి మమ్ము రక్షింపుము.
దేవ వరప్రసాదముచేత నిండిన మరియమ్మా వందనము. ఏలినవారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మా! సర్వేశ్వరుని మాతా! పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.
పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును, ఎప్పుడును సదాకాలము కలుగునుగాక.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏక పుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవమీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవనాడు చనిపోయిన వారలలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని యున్నారు. అక్కడ నుండి జీవించువారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్.
సర్వేశ్వరా స్వామీ! దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై యుండుటవలన సకల వస్తువులకంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపములచేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాప పడుచున్నాను స్వామీ. మహా దుఃఖపడుచున్నాను స్వామీ! మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామీ! ఇక మీదట ఒక్కనాటికిని ఇటువంటి పాపములను చేయనని నిండు మనస్సుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి ఆమేన్.
సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక.
సర్వేశ్వరుని నామమును వ్యర్థముగా పలుకక యుండువుగాక.
సర్వేశ్వరుని పండుగ దినములను పరిశుద్ధ పరచుదువుగాక.
తల్లి దండ్రులను గౌరవించుదువుగాక.
నరహత్య చేయక యుందువుగాక.
మోహ పాపములను చేయక యుందువుగాక.
దొంగిలింపక యుందువుగాక.
అబద్ధ సాక్ష్యము పలుకక యుందువుగాక.
మోహ తలంపులను తలంపక యుందువుగాక.
పరుల సొమ్మును ఆశింపక యుందువుగాక.
ఈ పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞలలో ఇమిడి యున్నవి.
సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదువుగాక.
నీవలె సమస్త జనులను ప్రేమించుదువుగాక.
ఆదివారములలోను, అప్పు పండుగలలోను శరీర కష్టమైన పనులను చేయక, నిండు పూజలో పాల్గొందువుగాక.
ఏడాదికి ఒక్కసారీయెనను పాప సంకీర్తనము చేయుడువుగాక.
పాస్కా పండుగ దినములలో దివ్య సత్ప్రసాదము లోకొనుదువుగాక.
విభూది బుధవారమందును పెద్ద శుక్రవార మందును, మాంసమును భుజింపక ఉపవాసము ఆచరించుదువు గాక.
తిరుసభ చట్టమును మీరి వివాహము చేసికొనక యుందువుగాక.
విచారణ గురువులకు సహాయము చేయుడువుగాక.
ఒకరు : ఏలినవారి సన్మనస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను.
అం : ఆయమ్మ పవిత్రాత్మవలన గర్భము ధరించెను. (మంగళవార్త జపము)
ఒకరు : ఇదిగో! ఏలినవారి దాసురాలను.
అందరు: నీ మాట చొప్పున నాకు జరుగును గాక. (మంగళవార్త జపము)
ఒకరు : పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యావతారమెత్తెను.
అందరు: మరియ మనతో కూడ వాసమై యుండెను. (మంగళవార్త జపము)
ఒకరు : జేసుక్రీస్తునాధుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులగునట్లు
అందరు: సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాతా మాకొరకు ప్రార్థించండి.
ప్రార్థించుదము : సర్వేశ్వరా స్వామీ! సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన జేసుక్రీస్తు మనుష్యావతారమును తెలిసికొంటిమి. అతని పాటుల వలననూ, స్లీవ వలననూ, ఉత్థానము యొక్క మహిమ మేము పొందునట్లు మాకు మీ వరప్రసాదములను దయచేయవలయునని దేవరవారిని వేడుకొనుచున్నాము. జేసుక్రీస్తు నాధుని దివ్య ముఖమును చూచి ఈ మనవులను మాకు దయచేయండి. ఆమేన్.
(పాస్కా పండుగ నుండి త్రియేక సర్వేశ్వరుని పండుగ వరకు)
పరలోకము యొక్క రాజ్ఞీ సంతోషించండి - అల్లెలూయా.
ఏలయన భాగ్యవతియైన మీ గర్భమునందు అవతరించినారు - అల్లెలూయా.
ఆనతిచ్చిన ప్రకారము ఉత్థానమైనారు - అల్లెలూయా.
మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి - అల్లెలూయా.
కన్యకయై యుండెడు మరియమ్మా ఆనందించి సంతోషించండి - అల్లెలూయా.
ఏలయన ప్రభువు నిజముగా ఉత్థానమైనారు - అల్లెలూయా.
ప్రార్థించుదము : సర్వేశ్వరా స్వామీ, మీ దివ్య కుమారుడును మా నాధుడైన జేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితిరే! వారి దివ్యమాతయైన కన్య మరియమ్మవలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందునట్లుగా అనుగ్రహించండి. జేసుక్రీస్తునాధుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్.
కృపారసముగల మాతయై యుండెడు రాజ్ఞీ! వందనము మా జీవమా మా మధురమా, మా శరణమా! వందనము. పరదేశులమై యుండెడు మేము ఏవ యొక్క బిడ్డలము. మిమ్ము జూచి మొరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమయమందు ప్రలాపించి ఏడ్చుచు-మిమ్ము జూచి నిట్టూర్పు విడుచు చున్నాము. అందువలన మా కొరకు మనవి చేసెడి తల్లి! మీ దయారసముగల కన్నులను మావైపు తిప్ప నవధరించండి. ఇదిగాక ఈ పరదేశము గడచిన తరువాత - ఆశీర్వదింపబడిన మీ గర్భఫలమగు యేసు నాధుని ప్రత్యక్ష దర్శనమును మాకీయ నవధరించండి. కృపగలిగిన తల్లి, దయారసము గలిగిన తల్లి! ఓ మధురమైన కన్య మరియమ్మా! యేసు క్రీస్తునాధుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు - సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాతా! మాకొరకు ప్రార్థించండి.
ప్రార్థించుదము : సర్వశక్తిగల దేవా! ముక్తిపొందిన కన్యకయు, తల్లియునైన మరియమ్మగారి ఆత్మ శరీరములను పవిత్రాత్మ వాసమగునట్లు అమర్చితిరే. అటువంటి దేవమాతను తలంచి సంతోషించెడు మేము ఆమె యొక్క కనికరమైన వేడుదలచేత ఇప్పటి కీడుల నుండియు, నిత్య మరణము నుండియు తప్పింపబడునట్లు కృపచేయ నవధరించండి. మానాధుడైన యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవులను మాకు దయచేయండి. ఆమెన్.
మిక్కిలి నెనరుగల తల్లి! మీ శరణుకు పరుగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒకరైనను మీవలన చేయి విడువబడినట్లు ఎన్నడును లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞీ! దయారసముగల తల్లి! ఇటువంటి నమ్మికచేత ప్రేరేపింపబడి, మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చియున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి యేడ్చెడు పాపినైన నేను, మీ దయాళత్వమునకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతార మెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి! నా విజ్ఞాపనమును త్యజింపక దయాపరులై విననవధరించండి ఆమెన్.
ఉదయకాల సమర్పణ
ఓ నా యేసువా! ఈ దినము నేనుచెప్పు జపములను, చేయు పనులను, పడు కష్టములను, పొందు సంతోషములను నా పాపముల పరిహారమునకును, సమస్త సభికుల ఉద్దేశముల కొరకును మీకు ఎడతెగక పూజా బలిలో నప్పగించెడు ఉద్దేశములతో వీనినేకీభవించి మరియమ్మగారి నిష్కళంక హృదయ మూలముగా మీకు సమర్పించుచున్నాను. మరియు విశేషముగా పరిశుద్ధ పాపుగారు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పించుచున్నాను.
పరిశుద్ధ కన్య మరియమ్మా! సర్వేశ్వరుని మాత, మీకు నన్ను సమర్పించుకొనుచున్నాను. మీ బిడ్డగా నన్ను కాపాడండి. ఈ దినము ఏ పాపములో పడకుండా నా కొరకు ప్రార్థించండి. దైవ కృపచేత నాకు కావలిగా నుండెడి సన్మనస్సుడా! నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్.
ప్రాతఃకాల ప్రార్థన
ఒ: స్వయంభువు, అనాది, అశరీరి, మితిలేని సకల మేలుల స్వరూపి, జ్ఞానము, బలిమి కారణముల చేత సర్వవ్యాప్తి, సర్వమునకు మూల కారణమైన పిత, పుత్ర, పవిత్రాత్మ యనెడు ఏక త్రిత్వ సర్వేశ్వరా! మిమ్ము ఆరాధించుచున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగినవారు మీరే!
అం: సదాకాలము మీ తిరునామము స్తుతింపబడునుగాక.
ఒ: దయాసముద్రమై యుండెడు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారమును తలంచి మేలెరిగిన స్తోత్రము చేయుదుము గాక.
సర్వేశ్వరా! తమరు నా యాత్మ శరీరములను ఏమి లేమి నుండి సృష్టించి, నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేసితిరే!
అం: స్వామీ! మీకే స్తోత్రము కలుగును గాక.
ఒ: దేవా! ఈ రాత్రియందు ఒక్క అపాయమైనను కలుగకుండా నన్ను కాపాడితిరే!
అం: స్వామీ! మీకే స్తోత్రము కలుగును గాక.
ఒ: దేవా! జ్ఞానస్నానము ద్వారా నన్ను తిరుసభలో చేర్చి మీ బిడ్డనుగా జేసుకొని, జేసు పవిత్ర మరణముచేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్తునిగా చేయ నవధరించితిరే!
అం: స్వామీ! మీకే స్తోత్రము కలుగును గాక.
ఒ: దేవా! నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక, పాపసంకీర్తనము ద్వారా నన్ను ఓదార్చి, నాకు సత్ప్రసాదమనెడి దివ్య భోజనము ప్రసాదింప నవధరించితిరే!
అం: స్వామీ! మీకే స్తోత్రము కలుగును గాక.
ఒ: దేవా! నేను ఎన్నియో ద్రోహములను చేసినను తల్లి దండ్రులవలె నన్ను కాపాడితిరే!
అం: స్వామీ! మీకే స్తోత్రము కలుగును గాక.
ఒ: సర్వేశ్వరా! మీ ఏకైక కుమారుడైన జేసునాథుడు నా కొరకు అనేక పాటుల ననుభవించి స్లీవమీద కఠినమైన మరణము పొంద తమరు చిత్తగించితిరే!
అం: స్వామీ! మీకే స్తోత్రము కలుగును గాక.
ఒ: సర్వేశ్వరా! మీరు అనతిచ్చిన ఆజ్ఞల ప్రకారము యోగ్యునిగా ప్రవర్తించెదనని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తలంపు, వాక్కు క్రియలను, ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్లు నడిపించు కొనుటకు మీకు వశపరచుచున్నాను. నేను చేసెడు సత్క్రియలన్నిటిని జేసునాధుని పుణ్య ఫలములతో దేవరవారు చేకొనండి. వానివలన వచ్చెడు జ్ఞాన ఫలములను పొంది నా పాపముల కొరకు ఉత్తరింప మనస్సుగానున్నాను. ఆమేన్
ఈ దినము మనకు ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకొనుదము
సకల కీడులనుండి... మమ్ము రక్షించండి స్వామీ!
సకల పాపముల నుండి "
మీ కోపాగ్ని నుండి "
అకస్మికమైన, ఆయత్తము లేని మరణము నుండి "
పిశాచి తంత్రముల నుండి "
కోపము, పగ మొదలైన దుర్గుణములనుండి "
మోహాగ్ని నుండి "
పిడుగులు, ఘోర గాలి మొదలైన వాని నుండి "
భూకంపము నుండి "
అంటు రోగము, కరువు, యుద్ధము మొదలైన వాని నుండి ...
నిత్య మరణము నుండి "
దేవరవారి మనుష్యావతార పరమ రహస్యమును జూచి "
దేవరవారి ఆగమనమును జూచి "
దేవరవారి జన్మమును జూచి "
దేవరవారి తపోస్నానమును, ఉపవాసమును జూచి "
దేవరవారి స్లీవను, పాటులను జూచి "
దేవరవారి మరణమును భూస్థాపనమును జూచి "
దేవరవారి పరిశుద్ధ శరీర ఉత్థానమును జూచి "
దేవరవారి మహిమ ప్రతాపములుగల మోక్షారోహణమును జూచి "
ఓదార్చెడు పవిత్రాత్మ యొక్క రాకడను జూచి "
న్యాయ నిర్ణయము జరిగెడు దినములలో "
రాత్రికాల జపములు
ఒ: నన్ను ఏమిలేమినుండి సృష్టించిన పితయైన సర్వేశ్వరునికి
అం: మహిమయును స్తుతియును కలుగునుగాక.
ఒ: నా కొరకు నరుడై జన్మించి, నన్ను రక్షించిన సుతుడైన సర్వేశ్వరునికి,
అం: మహిమయును స్తుతియును కలుగునుగాక.
ఒ: నన్ను పరిశుద్ధపరచి, నాకు తన వరప్రసాదములను పాలించెడు పవిత్రాత్మయైన సర్వేశ్వరునికి,
అం: మహిమయును స్తుతియును కలుగునుగాక.
ఒ: ఒకే దేవ స్వభావము నందు పిత, పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు దివ్య వ్యక్తులు ఉండెడు ఏకత్రిత్వ సర్వేశ్వరునికి
అం: మహిమయును స్తుతియును కలుగునుగాక.
ఆత్మ శోధన
పవిత్రాత్మయైన సర్వేశ్వరా! దేవరవారు మాయందు వేంచేయ అనుగ్రహించండి. పరలోకమునుండి మీ దివ్య ప్రకాశ కిరణములు మాపై వ్యాపింపచేయండి. నేను ఈ దినము చేసిన పాపములన్ని జ్ఞాపకమునకు తెచ్చుకొని వాని కొరకు మనస్తాపపడ మీ సహాయమునియ్య అనుగ్రహించండి. (ఈ దినము చేసిన పాపములను కొంతసేపు తలంచెదము. ఉత్తమ మనస్తాప జపము).
ఒ: ఏలినవారా! నా పాపములకు తగినట్టుగా దండించకండి
అం: నా అక్రమములకు తగినట్టుగా బదులు చేయకండి.
ఒ: నా పాపములను చూడకుండునటుల మీ దివ్యముఖమును త్రిప్పుకొనకండి.
అం: నా అక్రమములకు తగినట్టుగా బదులు చేయకండి.
ఒ: నీతిమార్గమున వర్తించు మనసును నా అంతరంగమందు నూతన పరచండి.
అం: నా యందు నిర్మల హృదయము కలుగజేయండి.
ఒ: మీ పరిశుద్ధ జ్ఞానము నా యొద్దనుండి తీసివేయకండి.
అం: మీ సన్నిధినుండి నన్ను త్రోసివేయకండి
ఒ: సర్వశక్తుడును దయాపరుడైన సర్వేశ్వరుడు మనమీద కృపగా నుండి, మన పాపములను మన్నించుగాక.
అం: మనలను నిత్య జీవమునకు తీసికొని పోవునుగాక.
ఒ: యేసు, మరియ, యోసేపుగారా!
అం: నా హృదయమును నా యాత్మమును నా జీవమును మీకు సమర్పించుచున్నాను.
ఒ: యేసు, మరియ, యోసేపుగారా!
అం: నా కడపటి అవస్థలో నాకు సహాయము చేయండి.
ఒ: యేసు, మరియ, యోసేపుగారా!
అం: మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణము విడుచుదునుగాక.
సర్వేశ్వరా స్వామి! సత్య స్వరూపులై యుండేడు దేవరవారు తెలియపరిచి, తిరుసభ ద్వారా బోధించు సత్యములు అన్నింటిని విశ్వసించుచున్నాను
సర్వేశ్వరా స్వామి! సర్వ నమ్మకములకు పాత్రులై యుండెడు దేవర వారు నా పాపములన్ని మన్నించి, నాకు మోక్ష భాగ్యమును కృప చేయుదురని నమ్ముచున్నాను
సర్వేశ్వరా స్వామి! దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపలై యుండుట వలన సకల వస్తువల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను
సర్వేశ్వరా స్వామి! మమ్మును మీ దయ చేత మేము భుజింపబోయే ఈ దానములను మా ఏలినవారైన జేసు క్రీస్తునాధుని తీరుముఖమును జూచి అశ్విరదింప నవధరించండి. పిత.......
సదాకాలము నిత్యులైన సర్వశక్తిగల సర్వేశ్వరా! దేవరవారు మాకియ్య నవధరించిన సకల మేలులకు గాను దేవరావారికి మేలెరిగిన స్తోత్రము చేయుచున్నాను పిత.........