ప్రారంభ పలుకులు
గురువు : పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున,
ప్రజలు : ఆమెన్
గురువు : మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
ప్రజలు : నీ ఆత్మతోను ఉండునుగాక.
పశ్చాత్తాప క్రియ
గురువు : సహోదరీ సహోదరులారా ! ఈ పూజను నెరవేర్చ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము.
గు : సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను
ప్ర : సహోదరీ సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఎలయన, తలంపుచేతను, వాక్కుచేతను, క్రియలచేతను, అశ్రద్ధచేతను బహుపాపములు చేసితిని. (రొమ్ముపై కొట్టుకొనుచు)
ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు.
(తరువాత కొనసాగించుచు)
అందుచేత, నిత్యకన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా మిమ్మును,
నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను
ఆమెన్.
గు : సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి, మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
గు/ప్ర : ప్రభువా! దయచూపుము
గు/ప్ర : క్రీస్తువా! దయచూపుము.
గు/ప్ర : ప్రభువా! దయచూపుము
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ
భూలోకమున మంచి మనస్సుగలవారికి శాంతి
ప్రభువైన సర్వేశ్వరా, పరలోకరాజా,
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా,
నిన్ను పొగడుచున్నాము,
నిన్ను స్తుతించుచున్నాము.
నిన్ను ఆరాధించుచున్నాము.
నిన్ను కీర్తించుచున్నాము.
నీ మహా వైభవమునకై,
నీకు వందనములు అర్పించుచున్నాము.
జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా,
ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొఱ్ఱెపిల్లా
పితయొక్క పుత్రుడా
లోకపాపములను పరిహరించు ప్రభువా!
మాకు దయచూపుము.
లోక పాపములను పరిహరించు ప్రభువా!
మా మనవి నాలకింపుము.
పిత కుడిప్రక్కన కూర్చోనియున్న ప్రభువా!
మాకు దయచూపుము.
ఎలయన, నీవు మాత్రమే పవిత్రుడవు
నీవు మాత్రమే ప్రభుడవు.
నీవు మాత్రమే మహోన్నతుడవు
యేసు క్రీస్తువా,
పితయైన సర్వేశ్వరుని మహిమలో
పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమెన్.
సంఘ ప్రార్థన
గురువు : ప్రార్థించుదము
సామాన్య కాలంలో-1
సంఘ ప్రార్థన : దయాపరులైన ఓ సర్వేశ్వరా! మీ సమక్షమున మనవి చేయుచున్న మీ ప్రజల ప్రార్థనలను ప్రేమతో అంగీకరించుకొనుడు. తద్వారా నిర్వహించవలసిన విషయములను వారు గ్రహించి వానిని తమ జీవితములలో ఆచరించుటకు వలయు శక్తిని దయచేయ వేడుకొనుచున్నాము. మీతో కలసి పవిత్రాత్మతో సహో యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమెన్.
సామాన్య కాలంలో-2
సంఘ ప్రార్థన : సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వరా! మీరు ఇహపరముల రెంటిని పరిపాలించుచున్నారు. మీ దాసుల ప్రార్థనలను దయతో ఆలకించి మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానములను ప్రసాదించుడు. మీతో కలసి పవిత్రాత్మతో సహా....... ఆమెన్.
తపస్సుకాలంలో
సంఘ ప్రార్థన : సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వరా! ఈ సంవత్సరంలో పాస్కాయుత్తకాల ఉపవాస క్రియల ద్వారా క్రీస్తు పరిపూర్ణ జ్ఞానమును మేము పొందుటకును, దాని ఫలితమును మా జీవితములందు యోగ్యమార్పు కలుగుటకును మా కుపకరించునట్లు మీ కృపను దయచేయుడు. మీతో కలసి పవిత్రాత్మతో సహా...... ఆమెన్.
పాస్కా కాలంలో
సంఘ ప్రార్థన : దయామయులగు ఓ నిత్య సర్వేశ్వరా! ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా మీ పవిత్ర ప్రజలయందు మీ విశ్వాసమును రగుల్చుచున్నారు. మీరు ప్రసాదించిన కృపను వారి యందు అధికము చేయుడు. తద్వారా వారు స్నానము ద్వారా పొందిన శుద్ధిని, మీ మనస్తత్వము ద్వారా సాధించిన నూతనత్వమును క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును సంపూర్ణముగా గ్రహించుకొనగలుగుదురుగాక. మీతో కలసి పవిత్రాత్మతో సహా...... ఆమెన్.
మరియమాత పూజలో
సంఘ ప్రార్థన : మా ప్రభువగు ఓ సర్వేశ్వరా! మీ సేవకులమగు మేము శారీరకముగను, మానసికముగను, సదా ఆరోగ్యము అనుభవించుచు సంతోషించు భాగ్యము దయచేయండి. నిత్య కన్యకయగు పరిశుద్ధ మరియమ్మగారి ప్రార్థనా సహాయమున ఇహలోక దుఃఖ దురితముల నుండి విముక్తి పొంది పరలోక నిత్యానందము తనివితీర అనుభవింతుము గాక! మీతో కలసి పవిత్రాత్మతో సహా...... ఆమెన్.
దైవవాక్యార్చన
మొదటి పఠనము / పునీత పౌలు గారు వ్రాసిన లేఖ
పాఠ : ............ గ్రంధము / పునీత పౌలు వ్రాసిన లేఖ (చివరిన)
పాఠ: ఇది ప్రభువు వాక్కు
అందరు: సర్వేశ్వరునికి వందనములు
సువిశేష పఠనము
యా : ప్రభువు మీతో ఉండునుగాక
ప్రజ : మీ ఆత్మతోనూ ఉండును గాక
యా : ....... వ్రాసిన పవిత్ర సువిశేషము లోని భాగము
ప్రజ : ప్రభువ మీకు మహిమ కలుగును గాక
యా : ఇది ప్రభు సువిశేషము
ప్రజ : క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక
(ప్రసంగము)
అపోస్తలుల విశ్వాస ప్రమాణము
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏక పుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవమీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవనాడు చనిపోయిన వారలలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని యున్నారు. అక్కడ నుండి జీవించువారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్.
కృతజ్ఞతార్చన
యా : సహోదరి సహోదారులారా నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునటుల ప్రార్థింపుడు
ప్ర : ప్రభువు, తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును, మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక.
అర్పణలపై ప్రార్థన
గురువు : ప్రార్థించుదము
సామాన్య కాలంలో - 1
అర్పణలపై ప్రార్థన : కరుణాసాగరులగు ఓ సర్వేశ్వరా! మీ ప్రజలు మీ కర్పించుచున్న ఈ బలి మీకు ప్రీతికరమగును గాక. దీని ద్వారా వారు పవిత్రతను పొంది తమ ప్రార్థనల ఫలితమును గూడ పొందగలుగుదురుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.
సామాన్య కాలంలో - 2
అర్పణలపై ప్రార్థన : దయామయులగు ఓ సర్వేశ్వరా! ఈ పూజాబలి నెరవేరునపుడెల్లను మీ రక్షణ కార్యము తిరుగ నెవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్య రీతిని నిర్వహించునట్లు సహాయము చేయుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.
తపస్సు కాలంలో
అర్పణలపై ప్రార్థన : సకల సౌభాగ్యముల దాతయగు ఓ సర్వేశ్వరా! మేమర్పించు ఈ బలులకు మా జీవితములు ఒప్పిదమగునట్లు కరుణించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.
పాస్కా కాలంలో
అర్పణలపై ప్రార్థన : సర్వ సృష్టికర్తయగు ఓ సర్వేశ్వరా! మీ ప్రజల అర్పణలను దయతో స్వీకరింపుడు. మీ నామ సంకీర్తనము ద్వారాను జ్ఞానస్నానము ద్వారాను నూతనత్వము పొంది వారు నిత్య సౌభాగ్యమును కూడ పొందగలుగుదురుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.
మరియమాత పూజలో
అర్పణలపై ప్రార్థన : మా కర్తయగు ఓ సర్వేశ్వరా! మీ ఏకైక కుమారుడు కన్య గర్భమున జన్మించినపుడు ఆమె కన్యత్వమునకు ఎట్టి భంగము కలిగించక మాతృత్వమునకే పవిత్రతను ఆపాదించెను. ఈ మనుష్యావతారము మమ్మాదుకొని పాప కూపము నుండి మమ్ము బయటకు తెచ్చునుగాక. మీ ఈ అర్పణము మీకు అంగీకార యోగ్యము కావలెనని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.
స్తుతి గీతము
యా: ప్రభువు మీతో ఉండునుగాక
ప్ర : నీ ఆత్మతోనూ ఉండును గాక
యా: మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము
ప్ర: ప్రభువు వైపు త్రిప్పియున్నాము
యా: మన దేవుడైన ప్రభువను కృతజ్ఞత తెలుపుదము
ప్ర: కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము
సామాన్య కాలంలో - 1
గు : ప్రభువైన దేవా ! పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర ! మేము ఎల్లప్పుడును, ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము.
మీ ప్రేమచేత మానవుని సృజించితివి, నీ నీతి ప్రాకారము దండించితివి , నీ దయవలన క్రీస్తు ద్వారా రక్షించితివి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు , శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులును, ఆనందపరవశులైన భక్తిజ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి , మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా :
ప్ర : దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు పరలోకమును, భూలోకమును, నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు, ధన్యుడు. మహోన్నతమున హోసాన్న.
సామాన్య కాలంలో - 2
గు : ప్రభువైన దేవా, పావనపితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా!, మేము ఎల్లప్పుడును, ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట, యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు వారే. అతడు పవిత్రాత్మవలన శరీరము ధరించి, కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు అతడు తన హస్తములను చాచి, సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను తెంచి ఉత్తానమును అనుగ్రహించెను. కనుక, దేవదూతలతోను, పునీతులతోను కలసి, ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా :
ప్ర : దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు పరలోకమును, భూలోకమును, నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు, ధన్యుడు. మహోన్నతమున హోసాన్న.
ఆగమన కాలంలో
గు : ఏలినవారా, పావనపితా! సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా! మా ఏలినవారైన క్రీస్తు ద్వారా, ఎల్లప్పుడును, ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. వారు ప్రధమాగమమున దీన నరరూపము ధరించి, మీరు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి, నిత్య రక్షణ ద్వారమును మాకు మరల తెరచిరి. పునరాగమమున వారు మహిమా ప్రతాపములతో ప్రత్యక్షమగునపుడు మీరు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందెదము. దానికై మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతో అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో పరలోక దళములన్నిటితో, నేకీభవించి మేము మహిమా గీతముతో మిమ్ము ఎదతెగక స్తుతించుట ఎట్లనగా :
ప్ర : దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు పరలోకమును, భూలోకమును, నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు, ధన్యుడు. మహోన్నతమున హోసాన్న.
క్రీస్తు జయంతి పూజలో
గు : ఏలినవారా, పావనపితా! సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా! మా ఏలినవారైన క్రీస్తు ద్వారా, ఎల్లప్పుడును, ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలయన, వార్తయైన వారి మనుష్యావతార రహస్యము ద్వారా మీ మహిమా ప్రకాశము మా మనో నేత్రములకు క్రొత్త వెలుగాయెను. ఇందువలన, వారి ద్వారా ప్రత్యక్షముగా దేవుని చూచు మేము, అగోచరమగు పరమానంద ప్రేమకు ఆకర్షింపబడుదుము గాక. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో నేకీభవించి, మేము మహిమా గీతముతో మిమ్ము ఎదతెగక స్తుతించుట ఎట్లనగా :
ప్ర : దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు పరలోకమును, భూలోకమును, నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు, ధన్యుడు. మహోన్నతమున హోసాన్న.
పాస్కా ఆయత్తకాలములో
గు : ఏలినవారా, పావనపితా! సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా! మా ఏలినవారైన క్రీస్తు ద్వారా, ఎల్లప్పుడును, ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలయన, ప్రతి సంవత్సరము, పాస్కోత్సవమును ఆనందముతో కొనియాడ అవకాశము దయచేయుచున్నారు. ఈ కాలమందు మీ విశ్వాసులు ఆత్మశుద్ధి పొందుచు, దానిని ఎదురు చూచుచున్నారు. అందుకై వారు భక్తి కృత్యములను ధర్మ కార్యములను శ్రద్ధతో ఆచరించుచున్నారు. నూతన జీవమిచ్చు సంస్కారములను తరచుగా స్వీకరించుచు, దైవ ప్రజలకు తగిన పరిపూర్ణ వర ప్రసాదములను పొందుచున్నారు. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో నేకీభవించి, మేము మహిమా గీతముతో మిమ్ము ఎదతెగక స్తుతించుట ఎట్లనగా :
ప్ర : దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు పరలోకమును, భూలోకమును, నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు, ధన్యుడు. మహోన్నతమున హోసాన్న.
పాస్కా కాలములో
గు : పావనపితా! ఎల్లప్పుడును, మీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కాయగు క్రీస్తు బలియైన ఈ కాలమున మిమ్ము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. నిజమైన గొఱ్ఱెపిల్ల వారే. వారే లోకముయొక్క పాపములను పరిహరించిరి. తమ మరణముచేత మా మరణమును ధ్వంసముచేసి తమ ఉత్తానముచేత మాకు పునర్జీవనమును ప్రసాదించిరి. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితులమై ప్రపంచమంతట మానవజాతి మీ స్తుతి గానమును చేయుచున్నది. ఆదియునుగాక సర్వశక్తులును, దూతల దళములను మేమును మహిమాయుత గీతమును నిరతము పాడుట ఎట్లనగా:
ప్ర : దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు పరలోకమును, భూలోకమును, నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు, ధన్యుడు. మహోన్నతమున హోసాన్న.
మరియమాత పూజలో
గు : ఏలినవారా, పావనపితా! సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా! ఎల్లప్పుడును, ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము, రక్షణము. ఈ దినము .......గా మరియమ్మగారిని స్మరించుకొనుచు మిమ్ము స్తుతించి మహిమ పరచుచున్నాము. మరియు ధన్య కన్య మరియమ్మగారిని తగిన గౌరవ, మర్యాదలతో కొనియాడుతూ, తల్లి శ్రీసభను ఘనపరచుచున్నాము. ఆమె దైవ వాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభునిమోయు యోగ్యతగల్లి, సృష్టికర్తకే జన్మనిచ్చి, ఆది తిరుసభకు అంకురార్పణ గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనయైన సిలువతో పాటు, క్రీస్తు ప్రభుని మరణముతో మోక్షజీవితానికి జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమె, అపోస్తులందరును మీరు వాగ్దానము జేసిన పవిత్రాత్మ రాకకై నిరీక్షిస్తూ ప్రభుని శిష్యులు ప్రార్థనలు చేయుచుండగా, ఆమె వారితో పాలుపంచుకుని, ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా నిలిచిరి. ఆమె, మోక్షమహిమకు ఎత్తబడిననూ, తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించి, ప్రభువు వేంచేయు మహిమాన్విత దినము వరకు, సంతసముతో శ్రీసభ సభ్యుల పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోను, దూతలతోను ఏకమై నిరతము మిమ్ము కీర్తించి, స్తుతించుట ఎట్లనగా:
ప్ర : దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు పరలోకమును, భూలోకమును, నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు, ధన్యుడు. మహోన్నతమున హోసాన్న.
రెండవ కృతజ్ఞత ప్రార్థన
గు : ఓ ప్రభువా! నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే.
గు : (యాజకుడు అర్పణలపై చాచి) కనుక నీ పవిత్రాత్మ ద్వారా, ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము.
(అర్పణలపై సిలువ గుర్తు వేయుచు)
గు : ఈ విధమున, ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు ✠ అగునుగాక!
గు : అతడు, సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించు కొనినప్పుడు, అప్పమునందుకొని, కృతజ్ఞతా వందనములు చెప్పి, త్రుంచి, శిష్యులకిచ్చుచు ఇట్లనెను
మీరందరు దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
(ప్రతిష్ఠింపబడిన అప్పమును ప్రజలకుచూపి ఆరాధించును)
ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని, మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి, శిష్యులకిచ్చుచు ఇట్లనెను.
మీరందరు దీనిని తీసుకొని, దీనినుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన, నిత్యనిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును, అనేకుల కొరకును, పాపపరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
(పాత్రమును ప్రజలకుచూపి మోకరించి ఆరాధించును)
గు : ఇది విశ్వాస రహస్యము
ప్ర : ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చువరకు వేచియుందుము.
(లేక)
ప్ర : ప్రభువా, మేము ఈ అప్పమును భుజించు నపుడెల్ల, ఈ పాత్రమునుండి పానము చేయునపుడెల్ల, నీవు మరల వచ్చువరకు నీ మరణమును చాటెదము.
(లేక)
ప్ర : లోకరక్షకా, మమ్ము రక్షింపుము, నీ సిలువ, ఉత్థానము వలన మమ్ము విమోచించితివి.
(తరువాత, యాజకుడు చేతులు విడదీసి, కొనసాగించుచు)
గు : కనుక తండ్రీ, క్రీస్తు మరణమును, ఉత్థానమును స్మరించుచు, జీవము నొసగు ఈ అప్పమును, రక్షణ పాత్రమును, నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి, నీకు పరిచర్య చేయుటకు, మమ్ము పాత్రులనుగా చేసినందుకు, నీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము, పవిత్రాత్మ ద్వారా ఐక్య పరచమని బ్రతిమాలుచున్నాము.
గు1: ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించియున్న, నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము.
మా (పేరు) జగద్గురువును, మా (పేరు) పీఠాధిపతిని, గురువులందరితోపాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము.
(మృతుల కొరకు చేయు పూజలో ఈ దిగువ ప్రార్థనను చెప్పవలయును)
(ఈ దినము) నీవు ఈలోకమునుండి పిలుచుకొనిన (పేరు) అను నీ సేవకుని (సేవకురాలిని) జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా, క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు (భాగస్థురాలైన ఈమె) అతని ఉత్తానమందును పాల్గొనునుగాక!
గు2: ఉత్తాన మగుదమను నమ్మకతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయినవారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి, దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్పగారితోను, పునీత అపోస్తలులతోను, ఆదినుండి నీకు సేవచేసిన పుణ్యాత్ములందరితోను, మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలసి మేము (చేతులు జోడించును) నీ కుమారుడగు యేసు క్రీస్తుద్వారా, నిన్ను స్తుతించి, మహిమ పరచుదుము.
గు : క్రీస్తుద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై యుండు నీకు, యుగయుగములు గౌరవమహిమలు కలుగునుగాక !
ప్ర : ఆమెన్.
మూడవ కృతజ్ఞత ప్రార్థన
గు : (యాజకుడు చేతులు విడదీసి, ఇట్లు చెప్పును) పావనపితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టియంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన, నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తుద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన, సమస్తమునకు జీవము పోసి, పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాద్యంతము, సూర్యోదయమునుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై, ప్రజలను నిరతము పిలుచుచున్నావు. (చేతులు అర్పణలపై చాచి) కావున, ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము.
(అర్పణలపై సిలువ గుర్తు వేయుచు)
ఈ విధమున ఇవి మా ప్రభువును, నీ కుమారుడునైన యేసుక్రీస్తు ✠ శరీర రక్తములు అగునుగాక! అతని ఆజ్ఞప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చు చున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని, నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి, స్తుతించి, త్రుంచి, శిష్యులకిచ్చుచు ఇట్లనెను :
మీరందరు దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
(ప్రతిష్ఠింపబడిన అప్పమును ప్రజలకుచూపి ఆరాధించును)
ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని, నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి, స్తుతించి, శిష్యులకిచ్చుచు ఇట్లనెను.
మీరందరు దీనిని తీసుకొని, దీనినుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన, నిత్యనిబంధనయొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును, అనేకుల కొరకును, పాపపరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
(పాత్రమును ప్రజలకుచూపి మోకరించి ఆరాధించును)
గు : ఇది విశ్వాస రహస్యము
ప్ర : 1) ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చువరకు వేచియుందుము. (లేక)
2) ప్రభువా, మేము ఈ అప్పమును భుజించునపుడెల్ల, ఈ పాత్రమునుండి పానము చేయునపుడెల్ల, నీవు మరల వచ్చువరకు నీ మరణమును చాటెదము. (లేక)
3) లోకరక్షకా, మమ్ము రక్షింపుము, నీ సిలువ, ఉత్థానమువలన మమ్ము విమోచించితివి.
గు : కనుక తండ్రీ, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును, స్మరించుచు, అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము, ఈ పవిత్ర జీవనబలిని, కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభయొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సభ్యపరచిన, నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరరక్తములతో, పోషింపబడి, పవిత్రాత్మతో నింపబడి, అతనియందు ఏక శరీరము, ఏక మనస్సు కలిగి యుండునటుల దయచూపుము.
గు1 : అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపాందించునుగాక ! నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయైన మరియమాతతోను, ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్పగారితోను, ధన్యులైన నీ అపోస్తలులతోను, వేదసాక్షులతోను, పునీత (పేరు) తోను సకల పునీతులతోపాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన, వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై, మేము ఆధారపడియున్నాము.
గు2 : ఓ ప్రభువా, మమ్ము నీతో సభ్యపరచు ఈ బలి లోకమంతటికి, శాంతిని, శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్రచేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా (పేరు) జగద్గురువును, మా (పేరు) పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరిని, నీవు సంపాదించుకొనిన ప్రజలందరిని, విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రీ, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరిని కనికరించి నీతో ఐక్యపరచుకొనుము.
గు3 : చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడినవారందరిని, దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు, నిత్యానందమును పొందుదుముగాక ! మా ప్రభువైన
క్రీస్తుద్వారా మనవి చేయుచున్నాము. అతనిద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
(అప్పమున్న పళ్ళెరమును, పాత్రమును కొంచెము పైకెత్తి)
గు : క్రీస్తుద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై యుండు నీకు, యుగయుగములు గౌరవమహిమలు కలుగునుగాక !
ప్ర : ఆమెన్.
సత్ప్రసాద క్రమము
యా : మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశము ననుసరించి, ప్రార్థింప సాహసింతము:
ప్ర : పరలోక మందున్న మా తండ్రీ, నీ నామము పూజింపబడునుగాక! నీ రాజ్యము వచ్చునుగాక! నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు, భూలోకమందును నెరవేరునుగాక! నానాటికి కావలసిన మా అన్నము, మాకు నేటికి అనుగ్రహింపుము. మాయొద్ద అప్పుపడినవారిని మేము మన్నించునట్లు, మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడులోనుండి మమ్ము రక్షింపుము.
యా: ప్రభువా, అన్ని కీడులనుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమువలన పాపము నుండి మమ్ము విముక్తులనుచేసి అన్ని కలతలనుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము.
ప్ర: ఏలయన, నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ.
యా : శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక, నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు, పరిపాలించు ప్రభువా.
ప్ర : ఆమెన్.
యా : ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక!
ప్ర : నీ ఆత్మతోను ఉండునుగాక.
యాజ : ఒకరినొకరు సమాధానము తెలుపుకొందము.
యా : (తక్కువ స్వరముతో) మన ప్రభువైన యేసు క్రీస్తు శరీరరక్తముల కలయిక. వాటిని స్వీకరించు మనకు నిత్య జీవమును ఒసగునుగాక.
(ఇంతలో విశ్వాసులు ఇట్లుచెప్పుదురు).
ప్ర : సర్వేశ్వరుని గొఱ్ఱెపిల్లా, లోక పాపములను పరిహరించు ప్రభువా! మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొఱ్ఱెపిల్లా, లోక పాపములను పరిహరించు ప్రభువా! మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొఱ్ఱెపిల్లా, లోక పాపములను పరిహరించు ప్రభువా! మాకు శాంతిని దయచేయుము.
యాజ : ప్రభువైన యేసుక్రీస్తువా, నేను లోకొను నీ శరీరము, రక్తము నాకు తీర్పుగాను, ఖండనగాను ఉండక నీ కనికరమును బట్టి నా యాత్మ శరీరములకు భద్రతగాను, ఔషధముగాను ఉండునుగాక.
యాజ : ఇదిగో, సర్వేశ్వరుని గొఱ్ఱెపిల్ల, ఇదిగో, లోకపాపములను పరిహరించు ప్రభువు, గొఱ్ఱెపిల్ల విందుకు పిలువబడినవారు ధన్యులు.
ప్రజలు : ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను (పాత్రురాలను) కాను. కాని నీవు ఒక్క మాట పలికిన, నా ఆత్మ స్వస్థత పొందును.
(యాజకుడు పీఠమువైపు శిరము వంచి, నెమ్మదిగా చెప్పును)
క్రీస్తు శరీరము నిత్య జీవితమునకు నన్ను కాపాడునుగాక! (భక్తితో క్రీస్తు శరీరమును లోకొనును. తరువాత పాత్రము నందుకొని, నెమ్మదిగా) క్రీస్తు రక్తము నాకు నిత్య జీవమును దయచేయునుగాక! (భక్తితో క్రీస్తు రుధిరమును సేవించును)
(గురువు దివ్య సత్ప్రసాదమును ప్రజలకు పంచి ఇచ్చును)
పునీత ఇన్యాశివారు చేసిన జపము & పరిపూర్ణ ఫలముగల జపము
పునీత ఇన్యాసివారు చేసిన జపము
క్రీస్తుని ఆత్మమా - నన్ను పరిశుద్ధ పరచండి.
క్రీస్తుని శరీరమా - నన్ను రక్షించండి.
క్రీస్తుని రక్తమా - నాకు తృప్తి కలుగునట్లు చేయ కనికరించండి.
క్రీస్తుని ప్రక్కలోనుండి కారిపడిన నీళ్ళా - నన్ను కడుగండి.
క్రీస్తు అనుభవించిన కష్టమా - నాకు ధైర్యము కలుగునట్లు జేయండి.
ఓమంచి జేసువా - నా ప్రార్థన వినవధరించండి.
మీ గాయముల లోపల - నన్ను దాచుకొనండి.
నేను మిమ్ము ఎడబాయునట్టు - చేయకండి
దుష్టశత్రువుల చేతిలో దొరకకుండ - నన్ను కాపాడండి.
నా మరణ సమయమందు - మీరు నన్ను పిలుచుకొనండి
నన్ను మీ సన్నిధికి - రాజేయండి
అప్పుడు మీ పునీతులతోకూడ ముగింపులేని కాలము - నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమెన్.
పరిపూర్ణ ఫలముగల జపము
మహా మధురముతో నిండిన మంచి జేసువా! దాసుడైన (దాసురాలినైన) నేను దేవరవారి సముఖములో మోకాళ్ళమీద నిలచి సాష్టాంగపడి “నాచేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్ని ఎంచినారు” అని దేవరవారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర జూచి దేవరవారి ఐదు గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి, తలంపుచే ధ్యానించెడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమయనెడి సుకృత తలంపులను నా యక్రముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయ మందు ముద్రింప నవధరింపవలయునని నా మంచి జేసువా! దేవరవారిని నా ఆత్మయొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమెన్
సత్ప్రసాద స్వీకరాణంతర ప్రార్థన
గురువు : ప్రార్థించుదము
సామాన్య కాలంలో - 1
సత్ప్రసాద స్వీకరణానంతర ప్రార్థన : సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా! దీనులమైన మేము మీ కృపకొరకు వేడుకొనుచున్నాము. మమ్ము మీ పవిత్ర ప్రసాదముచే సంతృప్తి పరచితిరి. మా జీవితమును మీకు యోగ్యరీతిని జీవించునట్లు మాకు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.
సామాన్య కాలంలో - 2
సత్ప్రసాద స్వీకరణానంతర ప్రార్థన : ప్రేమాన్వితులైన ఓ సర్వేశ్వరా! మీ ప్రేమ పూరిత మనస్తత్వమును మాకు ప్రసాదించుడు. తద్వారా ఒకే స్వర్గీయ ఆహారముచే సంతృప్తి పరచిన మీరు మమ్ముందరిని ఒకే ప్రేమయందు ఐక్యపరచమని వేడుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.
తపస్సు కాలంలో
సత్ప్రసాద స్వీకరణానంతర ప్రార్థన : మా తండ్రియగు ఓ సర్వేశ్వరా! మేమిప్పుడు స్వర్గీయ ఆహారముచే సంతృప్తి పొందియున్నాము. దీని ద్వారా మా విశ్వాసము అభివృద్ధి చెందుచున్నది. మా ఆశలు పెరుగుచున్నవి. మా యందు దైవ ప్రేమ అధికమగుచున్నది. వాస్తవముగా జీవనదాయక ఆహారమైన మా రక్షకునికై మేము తృష్ణ కలిగి యుండునట్లును, మీ నోటవచ్చ ప్రతి మాటపై ఆధారపడి వాని ద్వారానే జీవించునట్లును, మీ కృప ననుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.
పాస్కా కాలంలో
సత్ప్రసాద స్వీకరణానంతర ప్రార్థన : సర్వశక్తివంతులగు ఓ సర్వేశ్వరా! ఈ పాస్కా మహోత్సవ సందర్భమున మేము పుచ్చుకొనిన మీ పరమ ప్రసాదము మా మనసులందు నిరతము స్థిరపడునట్లు మాకు మీ కృపననుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.
మరియమాత పూజలో
సత్ప్రసాద స్వీకరణానంతర ప్రార్థన : దయామయులగు ఓ సర్వేశ్వరా! పరిశుద్ధ కన్య మరియమ్మగారి స్మరణ సందర్భమున ఆనందించుచున్నాము. పరలోకము నుండి దిగివచ్చిన దివ్యాహారమును భుజించి మీ కనికరము కొరకు వేచియున్నాము. మరియమ్మగారు రక్షణకార్యమున సహకరించినట్లే ఆమె ఆదర్శముననుసరించి మేమునూ శక్తి కొలది రక్షణ కార్యములో తోడ్పడ అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.
ముగింపు క్రమము
యాజ : ప్రభువు మీతో ఉండునుగాక
ప్రజలు : నీ ఆత్మతోను ఉండునుగాక!
యాజ : సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక!
ప్రజలు : ఆమెన్.
యాజ : పూజ సమాప్తమైనది సమాధానముతో వెళ్ళుము.
ప్రజలు : సర్వేశ్వరునికి వందనములు