తొలి పలుకులు
ప్రియ క్రైస్తవ విశ్వాసులారా!
సంగీతం దేవుని వరం. మనస్సులోని భావాలను, దైవం పట్ల మన విశ్వాసాన్ని స్వరాల రూపంలో అర్పించే ఒక పవిత్ర సాధనం. మాటల్లో చెప్పలేని ప్రార్థనను సైతం ఒక చిన్న గీతం హృదయ లోతుల్లో నుండి వెలికితీసి, మనలను దేవుని పాద సన్నిధికి చేరుస్తుంది.
పునీత అంతోని వారిపై భక్తిని మరింతగా పెంపొందించడానికి, అలాగే సంఘ ప్రార్థనా జీవితాన్ని సుసంపన్నం చేయాలనే సంకల్పంతో, ఈ పుణ్యక్షేత్రానికి ఒక ప్రార్థనా గీతమాలిక అవసరమని భావించి “పునీత అంతోని వారి ఆత్మగీతం” ను సిద్ధం చేయడం జరిగింది. ఈ రాగవాహిణి వెలువరించడం నాకు ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవం మరియు గొప్ప ఆశీర్వాదం.
ఈ ఆత్మగీతాన్ని సంకలనం చేయడంలో గురుశ్రీ తుమ్మా కరుణాకర్ మరియు శ్రీ విజయ్ యింకా అనేకమంది తమ ప్రతిభను, శ్రమను, విలువైన సమయాన్ని వెచ్చించారు. వారి సహకారం లేకుండా ఇంత సుందరంగా ఈ పుస్తకం రూపుదిద్దుకోవడం సాధ్యమయ్యేది కాదు. పునీత అంతోని వారిపై వారికి ఉన్న ప్రేమకు, అంకితభావానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ప్రత్యేకంగా, ఈ రాగామృతాన్ని వెలువరించేందుకు తమ ఆశీర్వాదాలను, ప్రోత్సాహాన్ని, మార్గనిర్దేశాన్ని అందించే, నా ప్రయత్నాన్ని అభినందిస్తూ ఈ సంకలానాన్ని ఆవిష్కరించిన మన ప్రియతమ పీఠాధిపతులు మహాఘన చిన్నాబత్తిని భాగయ్య తండ్రిగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనాలు.
ఈ గీతాలు ప్రతి విశ్వాసి హృదయంలో దేవుని ప్రేమను ప్రజ్వలింపజేస్తాయని, ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా తోడ్పడతాయని, ఈ ప్రతిని ఉపయోగించే ప్రతి వ్యక్తి అంత రంగాన్ని దేవుని సమీపానికి చేరువ చేస్తాయని నా దృఢ విశ్వాసం.
దేవుడు ఈ “పునీత అంతోని వారి ఆత్మగీతం”ను ఉపయోగించే ప్రతి ఒక్కరినీ సమృద్ధిగా ఆశీర్వదించాలని, ఇది మీ జీవితాలకు, మీ కుటుంబాలకు మరియు మీ సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.
Rev. Msgr. Allam Show Reddy
మాన్యశ్రీ అల్లం శౌరెడ్డి గారు
రెక్టర్ మరియు విచారణ గురువులు
పునీత అంతోని వారి పుణ్య క్షేత్రం