పీఠము ముందు వేడుకొను జపము
నా రక్షకుడా జూదులు మిమ్మును హత్యచేయుటకు తీసుకుపోయిన ఈ కఠిన మార్గమందు నా మీదగల స్నేహము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచిపోతిరి. ఈ దుఃఖమార్గము నందు మిమ్ము వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహమును దయచేయండి. మీ ప్రేమతో జీవించను, మీ ప్రేమతో మరణము పొందను ఆశించుచున్నాను.
పాట
జేసునాధు దుర్విలోను
గాసిజెంది ప్రేమతోడ
దాసులన్ రక్షించెను
మొదటవ స్థలము
జేసుప్రభుకు మరణశిక్ష విధించుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి.
జేసునాథుడు రాతి స్తంభమున దెబ్బలుపొంది ముండ్ల కిరీటము ధరింపబడినవెనుక స్లీవలో మరణము పొందుటను, పిలాతునిచే అన్యాయముగా విధింపబడుటను ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా మిమ్ము మరణదండనకు, విధించిన వాడు పిలాతుడుకాదు. అయితే నా పాపములే అట్టి తీర్పునకు లోజేసెను. మీకు నేరము చేసినందువలన నిండు మనస్సుతో దుఃఖించుచున్నాను. ఆమెన్. (పర. మం. త్రీత్వ)
ఓ :-మా మీద దయగా నుండండి స్వామీ
అం :-మా మీద దయగా నుండండి స్వామీ
ఓ :-మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధానముందు విశ్రమెంతురుగాక
పాట
భారమైన స్లీవప్రాను
క్రూరులైన జూదజాతి
వారు జేసు కెత్తిరి
రెండవ స్థలము
జేసునాథుడు స్లీవసు మోయుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి.
జేసునాథుడు తన భుజముమీద స్లీవసు మోసుకొని పోవు సమయమున నన్ను తలంచి తాను పొందబోవు పాటులను మరణముసు నా కొరకై తమ పితకు ఒప్పగించుటను ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా మరణకాలము వరకు, మీరు నాకు విధించెడు దురితమును చెకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు ఒప్పగించుచున్నాను. స్లీవ మోసుకొనిపోవుటలో మీరనుభవించిన పాటుల ఫలమునుజూచి నేను నిండు ఓర్పుతోను, పూర్ణ పరిత్యాగముతోను, నా స్లీవను మోసుకొనుటకు నాకు కావలసిన సహాయము దయచేయువలయు నని మిమ్ము ప్రార్థించుచున్నాను. ఆమెన్. (పర. మం. త్రీత్వ)
ఓ:- మా మీద దయగా ....
అం :- మా మీద దయగా.... మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధాన మందు విశ్రమింతురుగాక
పాట
మమ్ము బ్రోవ ప్రేమనంత
క్రుమ్మరించ వేడినాము
మిమ్ము నేక దీక్షతో
మూడవ స్థలము
జేసునాథుడు మొదటిసారి స్లీవక్రింద బోర్లపడుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి. జేసునాథుడు రాతి స్తంభమున పొందిన దెబ్బలవలన గాయ పరుపబడిన ఆయన దేహమునుండి రక్తము హేరాళముగా కారిపోయెను. అందువలన నడచుటకు శక్తిలేక భారమైన స్లీవప్రాను క్రింద పడినప్పుడు జేసు అనుభవించిన పాటులను ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా మీకింత బాధపెట్టినది స్లీవ భారము కాదు నా పాపముల భారమే ఈ మొదటిసారి పడుట యొక్క ఫలములను జూచి నేను పాపములో పడకుండా యెల్లప్పుడు మిమ్మును ప్రేమించ అనుగ్రహము పొలించండి. ఆమెన్. (పర. మం. త్రీత్వ)
ఓ :- మా మీద దయగా ....
అం :- మా మీద దయగా....
మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధానముందు విశ్రమింతురుగాక
పాట
దేవమాత దీనురాలై
దైవపుత్రునెంబడిరచే
స్లీవమోయు చుండగా
నాల్గవ స్థలము
జేసునాథుడు తన దివ్యమాతకు ఎదురుపడుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి.
జేసునాథుడు తమ మాతకు ఎదురుపడినప్పుడు వారిద్దరికి కలిగిన వర్ణింప సాధ్యముగాని దుఃఖము ఎంతయోనని ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా ఈ దర్శనమునందు మీరును, ఆమెయును అనుభవించిన వ్యాకులములను జూచి మీ పరిశుద్ధ మాతమీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కరుణించండి. వ్యాకుల సముద్రములో మునిగియుండు నా రాజ్ఞీ మీ దివ్య కుమారుని పాటులను నేను నిరంతరము భక్తితో స్మరించునట్లు నా కొరకు మనవి చేయండి. నేను మీతో యెల్లప్పుడు మోక్షములో మీ దివ్య కుమారుని దర్శించు భాగ్యము పొందునటు ప్రార్థించండి. ఆమెన్. (పర. మం. త్రీత్వ)
ఓ :- మా మీద దయగా ....
అం :- మా మీద దయగా....
మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధానముందు విశ్రమింతురుగాక
పాట
తల్లి జేసునాధుని గాంచి
తల్లడిల్లి సొమ్మ సిల్లె
నుల్లమెల్ల నీరయ్యెన్
ఐదవ స్థలము
జేసునాథుడు స్లీవను మోయుటకు సిరేనియా సీమోనుడు తోడగుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి.
జేసునాథుడు ఒక్కొక్క అడుగునకు జీవము విడిచెడు వానివలె నుండెను. యూరు ఇది చూచి జేసును స్లీవలో కొట్టి అవమానముగా చంపవలయునని తలంచగా ఆయన త్రోవలోనే మృతి పొందుదురేమో యని చింతించి జేసువెనుక స్లీవను మోయుటకు సిరేనియా సీమోనును బలవంతము చేయుటను ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా నేనును నా స్లీవను సీమోనువలె పోద్రోయక చేకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణమును, మరణసంకటమును చేకొని, మీ మరణముతో నొకటిగా చేర్చి మీకు ఒప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు మృతినొందితిరి. నేనును మీ నిమిత్తము మృతిపొంద అనుగ్రహము పొలించండి. ఆమెన్. (పర. మం. త్రీత్వ )
ఓ :- మా మీద దయగా ....
అం :- మా మీద దయగా....
మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధానముందు విశ్రమింతురుగాక
పాట
గాసి నొంది స్లీవమోయు
జేసుస్వామి మోము తుడ్చె
వాసిగ వేరోనిక
ఆరవ స్థలము
వెరోనికమ్మ జేసునాధుని ముఖమును తుడుచుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి.
జేసునాథుడు పొందిన గాయముల వలనను చెమర్చిన చెమట వలనను కాంతిహీనమైన అతని తిరుముఖమును వెరోనికమ్మ జూచి ఒక వస్త్రమును అతనికియ్యగా దానితో జేసువు తమ పరిశుద్ధ ముఖమును తుడుచుకొనిన మాత్రమున వారి ముఖపోలిక ఆ వస్త్రముమీద ముద్రింపబడుటను ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా సులడెసు. కాని ఇప్పుడు గాయముల చేతను, రక్తము చేతను, మారుపడి విరూపముగా నున్నది. జ్ఞానస్నానములో నేను మీ యిష్ట ప్రసాదములు పొందినపుడు నా ఆత్మయు అందముగా నుండెను. అయినను పాపముచేత దానిని చెడగొట్టుకొంటిని. మీ తిరుపాటులను చూచి దానిని చక్కపరచండి. ఆమెన్. (పర. మం. త్రీత్వ)
ఓ :- మా మీద దయగా ....
అం :- మా మీద దయగా...
మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధానముందు విశ్రమింతురుగాక
పాట
క్రూర జూద గుంపు జేసున్
ఘోరరీతి పట్టి కాట్టి
మేరలేక మోదిరి
ఏడోవ స్థలము
జేసునాథుడు రెండవసారి స్లీవక్రింద బోర్లపడుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి.
జేసునాథుడు రెండవసారి స్లీవక్రింద పడుటవలన ఆయన తిరుశిరస్సునందును, అవయవములందును గల గాయములలో తిరిగి నొప్పి కలుగుటసు ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా మీరు ఎన్నియోమారులు నాకు మన్నింపు దయచేసియున్నను నేను లెక్కలేనన్ని మారులు మళ్ళీ పాపములోబడి మీకు ద్రోహము చేసితిని. హో జేసువా ఇకనైన నా మరణపర్యంతమును మీ అనుగ్రహమునందు స్థిరముగా నుండ కావలసిన సహాయము ఈ రెండవ పాటుసు జూచి నాకు దయచేయండి. నాకు వచ్చెడు సకల శోధనల యందు నేను మీ శరణుజొచ్చి మిమ్మును యెడబాయకుండునటుల అనుగ్రహము పొలించండి. ఆమెన్. (పర. మం. త్రీత్వ)
ఓ :- మా మీద దయగా ....
అం :- మా మీద దయగా....
మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధానముందు విశ్రమింతురుగాక
పాట
కోరి పాప పుంజమెల్ల
బారద్రోల జేసుస్వామి
క్రూరబాధనొండెను
జేసునాథుడు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి.
జేసునాథుడు నడచిపోవునప్పుడు ఆయన శరీరము నుండి రక్తము ప్రవాహముగా పారునప్పుడు, కొందరు స్త్రీలు ఆయన పరితాపకరమగు స్థితినిజూచి కనికరపడి యేడ్చిరి. అప్పుడు జేసునాథుడు వారిని ఊరడించుచు జెరుసలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడువక మీ నిమిత్తమును, మీ బిడ్డల నిమిత్తమును ఏడువండి అని మందలించుటను ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా మీకు విరుద్ధముగా నేను కట్టుకొనిన ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాను నన్ను ఇంతగా ప్రేమించిన మీకు నా పాపములచేత రప్పించిన స్థితినిజూచి చింతించు చున్నాను. నరక వేదనల భయమువలన నాకు కలుగు దుఃఖము కన్న మీ యెడలగల ప్రేమవలన నాకు అధిక దుఃఖము కలుగుచున్నది. ఆమెన్. (పర. మం. త్రీత్వ)
ఓ :- మా మీద దయగా ....
అం :- మా మీద దయగా....
మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధానముందు విశ్రమింతురుగాక
పాట
స్లీవ మోయు శక్తి లేక
త్రోవయందు క్రిందగూలె
లేవలేక జేసువు
జేసునాథుడు మూడవసారి స్లీవక్రింద బోర్లపడుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి.
జేసునాథుడు గాయములవలన బలహీనుడయ్యెను. కొల పాతకుల నిష్ఠూరము మితము మించి యుండెను. ఆయనకు కదులుటయే కష్టముగా నుండినను శీఘ్రముగా నడవవలయునని సైనికులు తొందరపరచుచుండిరి. అందువలన జేసునాథుడు మూడవసారి స్లీవక్రింద బోర్లపడుటను ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గుణములను ఈ లోకాశలను జయించుటకు మీరు పొందిన బలహీనముయొక్క ఫలమును జూచి నాకు వర ప్రసాదములను దయచేయండి. మీ సహాయముచేత ఇక యెప్పటికిని పాపములో పడను. ఆమెన్. (పర. మం. త్రీత్వ)
ఓ :- మా మీద దయగా ....
అం :- మా మీద దయగా....
మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధానముందు విశ్రమింతురుగాక
పాట
ఒంటనున్న గాయమంత
నంటగా వస్త్రానెల్ల
గెంటి నీడ్చిలాగిరి
జేసునాధునియొక్క వస్త్రములను తీసివేయుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి.
కొలపాతకులు బలవంతముగా జేసునాధుని వస్త్రములను ఒలుచునప్పుడు, వారు అతని శరీరముతో కరుచుకొని యుండిన ఆ వస్త్రములను మడ్డితనముగా పీకివేసిరి. వస్త్రములతో మాంసమును పెరుకుకొని వచ్చుటవలన జేసువు పడిన కఠోర వేదనలను ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా ఈ సమయమందు మీరు మీ శరీరమంతట పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదకక యుండుటకును నిరోహత్వమునకు విరుద్ధమైన పాపములను చేయక యుండుటకును సహాయము చేయండి. అంతటికన్న మిమ్మును ఎక్కువగా ప్రేమించునట్లు దయచేయండి. ఆమెన్. (పర. మం. త్రీత్వ)
ఓ :- మా మీద దయగా ....
అం :- మా మీద దయగా....
మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధానముందు విశ్రమింతురుగాక
పాట
జంటదొంగ వార్లమధ్య
మంటభారమైన స్లీవ
కంటగించినాటిరి
జేసునాధస్వామి స్లీవలో కొట్టబడుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి.
జేసునాథుడు స్లీవమీద పరుండబెట్టబడిన వెనుక తమ చేతులను చాచి నా రక్షణముకొరకు పితయైన సర్వేశ్వరునికి తమ జీవమును బలిగా ఒప్పగించిరి. పాతకులు ఇనుపీల చేత ఆయనను స్లీవమీద కొట్టి దానిని నాటి అవమానకరమైన ఈ ప్రాణి మీద ఆయనను మహా వేదనతో చావ విడుచుటను ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా నా హృదయమును మీ తిరు పాదములకు అంటగొట్టి అది ఇంక యెన్నటికిని మిమ్ము విడువకుండా యుండుటకు నిరంతరము మీ పాదములు కాచుకొని యుండ చేయండి. నాకన్న అధికముగా మిమ్ము ప్రేమించు చున్నాను. మీకు ద్రోహము చేసినందుకు నిండు మనస్సుతో దుఃఖపడుచున్నాను. ఆమెన్. (పర. మం. త్రీత్వ)
ఓ :- మా మీద దయగా ....
అం :- మా మీద దయగా....
మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధానముందు విశ్రమింతురుగాక
పాట
నేడెయంత పూర్తియంచు
నాడె శ్రీశిరంబు వంచి
వీడినారు ప్రాణము
జేసునాథుడు స్లీవలో మృతినొందుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి.
జేసునాథుడు మూడుగంటలు స్లీవమీద మహా ఆరాటమును పొందిన వెనుక ఉపద్రవములస పీడిరపబడి శరీర భారమున క్రుంగి తలవంచి మరణించుటను ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా నా మీదగల ప్రేమచేత మీరు మృతినొందిన స్లీవప్రానుసు భక్తితో ముద్దుపెట్టుచున్నాను. నా పాపము వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసియుండెను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందుచేత నాకు మోక్ష భాగ్యము ఇచ్చుదురని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగిలించుకొని మృతిపొందుటకు అనుగ్రహము నాకు దయచేయండి. నా యాత్మను మీ చేతులలో నొప్పగించుచున్నాను. ఆమెన్. (పర. మం. త్రీత్వ)
ఓ :- మా మీద దయగా ....
అం :- మా మీద దయగా....
మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధానముందు విశ్రమింతురుగాక
పాట
బాధపెట్టు శత్రుగుంపు
నాదరించ వేడినారు
నాధుడైన జేసువు
జేసునాథుడు స్లీవనుండి దింపబడుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి.
జేసునాథుడు జీవము విడిచిన వెనుక ఆయన శిష్యులగు జోసేపు నికోదేమును వారిద్దరు ఆయనను స్లీవనుండి దించి దుఃఖముతో నిండిన అతని తల్లి చేతులలో ఉంచిరి. ఆమె చెప్పనవికాని నేరుతో ఆ దివ్య శరీరమును చేకొని కౌగలించుకొనుటను ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా నా నిమిత్తము మృతిపొందితిరి కనుక నేను మిమ్మును ప్రేమించుటకు సహాయము చేయండి. మీ నిమిత్తము మృతిపొంద ఆశించుచున్నాను. వ్యాకులభరితమైన మాతా మీ ప్రియ కుమారుని మీద మీకు గల ప్రేమను జూచి నన్ను మీ దాసునిగా చేకొని, నాకొరకు ప్రార్థించండి. ఆమెన్. (పర. మం. త్రీత్వ)
ఓ :- మా మీద దయగా ....
అం :- మా మీద దయగా....
మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధానముందు విశ్రమింతురుగాక
పాట
భాసురుండు మోక్షరాజు
దాసులైన పాపజాతి
కోసమై మరణించెను.
జేసునాధుని శరీరమును సమాధిలోనుంచుట
ఓ :- జేసుక్రీస్తువా మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అం :- ఏలయనగా, మీ పరిశుద్ధ స్లీవచేత లోకమును రక్షించితిరి.
జేసునాధుని శరీరమును మోసుకొనిపోవుచున్న ఆయన శిష్యులను అతని పరిశుద్ధ తల్లి వెంబడించి, అతని దివ్యశరీరమును తానే సమాధిలో క్రమపరచెను. అటువెనుక వారులు సమాధిని మూసి యెడబాసి పోవుటను ధ్యానించుదము గాక
ధ్యానము
నా రక్షకుడైన జేసువా మీ మీద మూసియుండు రాతిని ముద్దుచేయుచున్నాను. మీరు మూడవనాడు జీవవంతులై లేచితిరి గదా ఈ ఉత్థానమును చూచి లోకాంత్యమున నేనును మీతో ఉత్థానమగుటకును, మోక్షమునందు సదా మిమ్ము పొగడి ప్రేమించుటకును, నాకు అనుగ్రహము పాలించండి. ఆమెన్. (పర. మం. త్రీత్వ)
ఓ :- మా మీద దయగా ....
అం :- మా మీద దయగా....
మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాధానముందు విశ్రమింతురుగాక
పాట
పాపులైన దీనులారా
దాపుచేరి కొల్వరండి
పాపదోష మీదునె
హా రక్షకుడా లోకరక్షణము కొరకు మీరు శత్రువుల వలన తిరస్కరింపబడను, ద్రోహియగు యూదాసుని ముద్దువలన శత్రువులకు చూపించబడను, అనాసు, కైపాసు, పిలాతు, హేరోదేసను వారల ముందర అవమానముగా ఒప్పగించబడను. అబద్ధ సాక్షుల వలన నేరము మోపబడను, ఉమియబడను, ముండ్ల కిరీటము ధరింపబడను, మీ వస్త్రములు తీయబడను, మీరు స్లీవ మీద కొట్టబడను, ఈటెచేత పొదవబడను చిత్రాచింతిరే. నేను మహా పాపిగా నుండినను నేను ఇప్పుడు స్మరణచేసిన మీ తిరుమరణమును దేవరవారు చూచి నరక బాధలలోనుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క స్లీవమీద కొట్టబడి మనస్తాపబడిన దొంగ వానిని తీసుకుపోయిన స్థలమునకు నన్నును తీసుకుపోండి. ఆమెన్.
పరిశుద్ధ పాపుగారి తలంపు నెరవేరునట్టుగా (పర. మం. త్రీత్వ)