ప్రతి మంగళవారము నిద్రచేయనున్న భక్తులకు అన్నదానము నిమిత్తము దాతలుగా ఉండదలచినచో విచారణ గురువులను (7075047884) సంప్రదించవలసినదిగా మనవి.
పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం – నగరంపాలెం, గుంటూరు
గుంటూరు నగరంలోని నగరంపాలెంలో 1990 సంవత్సరములో నిర్మించిన పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం విశ్వాసానికి, ప్రార్థనకు, దైవకృపకు నిలయంగా విరాజిల్లుతోంది.
ఈ పుణ్యక్షేత్రం కతోలిక క్రైస్తవులతో పాటు హిందూ, ముస్లిం తదితర మతాలకు చెందిన అనేకమంది సహోదరీ సహోదరులను ఆకర్షిస్తూ, మతసామరస్యానికి మరియు సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోంది.
ఇక్కడ ప్రతిరోజూ మరియు ప్రతి మంగళవారం మరియు ప్రత్యేక సందర్భాలలో జరిగే దివ్యబలిపూజలలో అనేకమంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని దేవుని ఆశీస్సులను పొందుతున్నారు. పునీత అంతోని వారి మధ్యవర్తిత్వ ప్రార్థనల ద్వారా తమ జీవితాలలో అనేక అనుభవాలను, అద్భుతములను దైవకృపలను చవిచూసిన భక్తులు దేవుని మహిమను కొనియాడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుండి కూడా అనేకమంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, పునీత అంతోని వారి మధ్యవర్తిత్వాన్ని వేడుకుంటూ తమ విశ్వాసాన్ని మరింత బలపరచుకుంటున్నారు.
ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రతి భక్తునికి ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి.
ప్రార్థన, విశ్వాసం, ప్రేమ, సేవ అనే క్రైస్తవ విలువలకు ప్రతిరూపంగా నిలుస్తున్న ఈ పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరికీ ఆశకు, ఆదరణకు, ఆధ్యాత్మిక బలానికి చిరునామాగా నిలుస్తోంది.
పునీత అంతోని వారి మధ్యవర్తిత్వ ప్రార్థనల ద్వారా ప్రతి ఒక్కరూ దేవుని అపారమైన ప్రేమను, కరుణను అనుభవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
మీ ప్రార్థనల కొరకు మీ విన్నపాల కొరకు పుణ్యక్షేతరాన్ని దర్శించి పునీత ఆంథోనీ వారిని ప్రార్థించండి.
ప్రత్యక్ష ప్రసారము
పుణ్యక్షేత్ర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం (LIVE) లేనప్పుడు, 'This video is unavailable' అని కనిపిస్తుంది.